KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల వెంట గ్రానైట్ వ్యర్థాలు వేసే వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యర్థాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న విషయం కలెక్టర్ అనుదీప్ దృష్టికి రావడంతో వారి ఆదేశాల మేరకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల భద్రత విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు.