MDK: చేగుంట పోలీస్ స్టేషన్ను శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సందర్శించారు. స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వారికి న్యాయం జరిగే విధంగా విచారణ చేపట్టాలని సూచించారు. చోరీలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.