KNR: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లిలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వా మి దేవాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, శాంతి కళ్యాణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షబంధనం, రుతిక్ త్వరణం, నిర్వహించారు. అలాగే, శనివారం గోపూజ, యాగశాల ప్రవేశం, ద్వార తోరణ ధ్వజ కుంభ పూజ, అగ్ని ప్రతిష్టాపన, పలు కార్యక్రమాలు జరుగుతాయి.