NZB: రైలులో గుట్కా ప్యాకెట్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు NZB రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. GRP, RPF సిబ్బంది కలసి ఫ్లాట్ ఫారం నంబర్-1పై తనిఖీలు చేస్తుండగా NZB ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ అనీస్ నిషేధిత టోబాకో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 80 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.