ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.