MDK: చేగుంట మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతుందని ఏఈ మహమ్మద్ రియాజుద్దీన్ తెలిపారు. మండల వ్యాప్తంగా 612 మంది లబ్ధిదారులకు ప్రెసిడెంట్ అందించామని, 551 ఇళ్లకు మార్కింగ్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 300 ఇళ్లకు బేస్మెంట్ పూర్తయిందని తెలిపారు. వివిధ దశలో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు.