MHBD: గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు తొర్రూరు ఎంపీడీవో వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈరోజు సాయంత్రం వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.