ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఆ దేశ చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్, లుక్ఆయిల్పై ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో భారత్, చైనా కొనుగోలుదారులు దూరం కావడంతో ఆ దేశ చమురు ధరలు పతనమైనట్లు తాజాగా అమెరికా ట్రెజరీ శాఖ పేర్కొంది.