TPT: చిన్న అప్పన్న తన పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి 2018 వరకే అతను నా దగ్గర పనిచేశాడు. తర్వాత వేరే ఎంపీలకు పీఏగా వ్యవహరించాడు. అతను తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి. దేవుడి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో నేనేదో అవినీతి చేశానంటున్నారు. ఆ నీచమైన పని నేను చేయలేదని స్పష్టం చేశారు.