మరికాసేపట్లో ప్రతిష్ఠాత్మక యాషెస్ తొలి టెస్ట్ జరగనుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇంగ్లంట్ బ్యాటర్లకు సవాలే. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి 15 మ్యాచుల్లో వాళ్లు ఒక్కటీ గెలవలేదు. 13 AUS గెలవగా, 2 డ్రా అయ్యాయి. 1882 నుంచి జరుగుతున్న ఈ టోర్నీ చరిత్రలో ఇరుజట్లు ఇప్పటివరకు 361 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో AUS 152, ENG 112 నెగ్గాయి. 97 టెస్టులు డ్రాగా ముగిశాయి.