నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య లాంచీ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పెద్దలకు వన్ వే రూ.2 వేలు, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా టికెట్ రేట్లు నిర్ణయించారు. పిల్లలకు (5-10) వన్ వే రూ.1,600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600 ఉంది. టికెట్ల బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.