TG: బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన ఇవాళ బీసీ సంఘాల సమావేశం జరగనుంది. రిజర్వేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హాజరుకానున్నారు. కాగా ఒకవైపు హైకోర్టులో రిజర్వేషన్లపై కేసు నడుస్తుండగా, తీర్పు రాకముందే ఎన్నికలకు ఎందుకెళ్తున్నారని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.