ELR: 2019 చంద్రబాబు పాలనలో కట్టుకున్న ఇళ్లకు నేటికీ డబ్బులు అందడం లేదంటూ చింతలపూడికి చెందిన గంజి మహేశ్వరి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఆమె ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసింది. మా ఖాతాలో రూపాయి పడింది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం మా బిల్లు ఇవ్వలేదు’ అని వాపోయింది.