HYD: ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా GHMC ఖజానాకు గండికొడుతున్న 2 సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం తమ స్టూడియో విస్తీర్ణానికి అనుగుణంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించడం లేదని, జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో తక్కువ విస్తీర్ణం చూపుతూ లైసెన్స్ ఫీజు చెల్లిస్తుండడంతో నోటీసులు జారీ చేశారు.