MDK: మాసాయిపేట మండల కేంద్రంలో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన నాగరాజు గౌడ్ కూతురు మహాలక్ష్మి (19) మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడింది. మనస్థాపానికి గురైన మహాలక్ష్మి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.