JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామ శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ నర్సరీని నిజామాబాద్ రేంజ్ అధికారి గంగాధర్ పరిశీలించారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామ శివారులో ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చైతన్య శ్రీ, బీట్ ఆఫీసర్ మధు, సిబ్బంది పాల్గొన్నారు.