ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పాడ్యమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి వేకువజామున పవిత్ర గంగాజలాలతో అర్చకులు అభిషేకం నిర్వహించి, బంగారు, వెండి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈరోజు మార్గశిర మాసం ప్రారంభం కాబట్టి, విష్ణు మూర్తిని పూజించడం విశేషమని అర్చకులు తెలిపారు.