PPM: పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ మర్రిపాడు గిరిజన గ్రామానికి సరైన రోడ్డు లేదు. రాళ్లు తేలిన మార్గంలో రాకపోకలకు నరకం చూస్తున్నారు. విద్యార్థులు సుమారు రెండు కి.మీ దూరంలోని జీలికివలస మండల పరిషత్తు పాఠశాలకు వెళ్లేందుకు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. గురువారం సీఐటీయూ నాయకుడు కె.ఈశ్వరరావు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.