HYD: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం CM రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన KTRపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆమె పేర్కొన్నారు.