SKLM: పొందూరు మండలం మలకాం గ్రామంలో ఇవాళ కృషి విజ్ఞాన కేంద్రం (KVK) శాస్త్రవేత్త కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు స్థానిక రైతులతో సమావేశమై, ఆధునిక సాంకేతికత వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రైతు ఏడాదికి ఒకసారి నేల పరీక్ష చేయించుకోవాలని సూచించారు.