ADB: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గురువారం భీంపూర్ మండలంలోని రాంపూర్ గ్రామస్థులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గ్రామంలోని పలు సమస్యలను వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గజేందర్ పేర్కొన్నారు.