ATP: జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోని నందలపాడు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఉన్నారు.