GDWL: హెల్మెట్లు వాడండి ప్రాణాలు కాపాడుకోండి అని కళాకారుల బృందం పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం పోలీస్ కళాబృందం కె.టి.దొడ్డి మండలం ఉమిత్యాలతండాలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా వారికి ఎన్నో కార్యక్రమాలను పాటలు రూపంలో వర్ణించి ప్రజలు వివరించారు. అలాగే యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు.