TG: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని మాజీమంత్రి KTR విమర్శించారు. సిరిసిల్లలోని ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గతంలో ఆటో కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వం బీమా రెన్యూవల్ చేయకపోవడంతో ఆటోడ్రైవర్లు బీమా సౌకర్యం కోల్పోయారు. సిరిసిల్లలోని సుమారు 5 వేల మంది ఆటో డ్రైవర్లకు బీమా నేనే కడతా’ అని పేర్కొన్నారు.