SKLM: జిల్లాస్థాయి అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరు కాకపోతే నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశమందిరంలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలు సమర్పించేటప్పుడు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇకముందు హాజరు కావాలని పేర్కొన్నారు.