TG: సౌదీ ఘటనపై కేంద్రమంత్రి జైశంకర్‌తో మాట్లాడినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘సౌదీకి ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నాం. ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తతో మాట్లాడాను. సౌదీ ప్రభుత్వం మృతదేహాలను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపై ఆ దేశ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులతో చర్చించి మృతదేహాలపై నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.