ELR: ఖరీఫ్ 2025-26లో పండించిన సోనా, సంపత్ సోనా రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు నిరాకరించడంతో చింతలపూడి మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం బస్తాలను లారీలలో ఎగుమతి చేసి 48 గంటలు గడిచినా మిల్లర్లు అనుమతించడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.