HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా CM రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు అందించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ ప్రగతి సంబంధిత అంశాలపై చర్చ జరిగింది.