కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే.. ఆయన అనుగ్రహం పొంది సకల పాపాలు తొలగి అదృష్టం కలిసివస్తుందని భక్తుల నమ్మకం. ఇవాళ చివరి సోమవారం కాబట్టి ఇలా చేయాలి. ఉదయాన్నే శివుడి దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి. నీటితో లేదా పంచామృతంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ధ్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి. ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి.