KDP: సిద్ధవటం మండలం కనుములోపల్లి శివాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు హోమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలో పాల్గొన్నారు. ఇక్కడ కొలువైన 109 శివలింగాలను ప్రత్యేక పూలతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త బాబు స్వామి భక్తులకు పంచామృత, తీర్థ ప్రసాదాలను అందజేశారు.