MBNR: శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. ఈ కాలంలో పొగ మంచు కారణంగా ప్రధాన రహదారులపై గ్రామీణ ప్రాంతాల రోడ్లపై ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. హైబీమ్ లైట్లు వాడకూడదని లోబీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.