E.G: రాజమండ్రిని పుష్కరాల నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ. 270 కోట్ల అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిన్న ప్రకటించారు. నగరంలోని ప్రధాన సమస్య అయిన ముంపు నివారణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా నగరంలోని మేజర్ డ్రైనేజీల్లోని సిల్టును పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామని పేర్కొన్నారు.