TG: తమ ఇంట్లో ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు మక్కాకు వెళ్లారని బస్సు ప్రమాద బాధిత కుటుంబీకుడు పేర్కొన్నాడు. అల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మక్కా, మదీనా టూర్ వెళ్లారని చెప్పాడు. ‘మదీనాకు 25 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగిందని తెలిసింది.. ఘటన గురించి పూర్తి సమాచారం తెలియట్లేదు. ప్రమాదం గురించి తెలయడంతో ఎంపీ అసదుద్దీన్‌కు ఫోన్ చేశాను’ అని తెలిపాడు.