సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది మృతి చెందడంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.