దొండకాయలను తింటే పొటాషియం అధికంగా లభిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. హైబీపీ ఉన్నవారికి దొండకాయలు ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనత తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇవి పనిచేస్తాయి. దొండకాయలను రోజూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.