CTR: జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరాలు ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు.విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.19న చిత్తూరు, 20న కార్వేటినగరం, 21న ఐరాల, 22న నగరి, 23న సదుంలో శిబిరాలు ఉంటాయి.