HYD: గంజాయి రవాణాకు విక్రయదారులు తీరొక్క మార్గాలు ఎంచుకుంటున్నారు. పోస్ట్ ఆఫీస్ కొరియర్లు, చాక్లెట్లు, ఇడ్లీ, దోశల పార్సిల్ కవర్లలో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు. కొరియర్ కంపెనీలు, డెలివరీ బాయ్స్ అందులో ఏముంటుందో తెలియక పోలీసులకు చిక్కుతున్న పరిస్థితి. డెలివరీ చేసే ప్రతి వస్తువును పోస్ట్ ఆఫీస్ సహా అన్నిట్లో చెక్ చేయాలనే డిమాండ్ వస్తోంది.