TG: జూబ్లీహిల్స్ ఎన్నికలపై కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఖండించారు. గత పదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిలదీశారు. ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారని ఆరోపించారు.