MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో ఇవాళ ఉదయం 10 గంటలకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 44వ జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై వివరించారు.