NLG: తిప్పర్తి వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల ఎగుమతి లారీల కొరతతో నిలిచిపోయిందని రైతులు తెలిపారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, యాసంగి వ్యవసాయ పనులు మొదలైనప్పటికీ కొనుగోలు వేగవంతం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.