TG: రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ లక్ష్యం కోసం ప్రజాభవన్‌లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ‘2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’ సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సీఈఓలను ఆహ్వానిస్తున్నట్లు భట్టి తెలిపారు.