TG: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. నల్గొండ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ సందర్భంగా.. ‘ప్రజలు తినే బియ్యాన్నే అందిస్తే పథకం ఉద్దేశం నెరవేరుతుంది. TGలాగే కేంద్రం కూడా సన్నబియ్యం సరఫరా చేయాలి’ అని అన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.