GNTR: తురకపాలెంలో 13 ఏళ్ల బాలిక వివాహం జరిగిన ఘటనపై గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ విచారణ జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశారు. వరుడు దానియేలు, అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మమ్మ, చర్చి పాస్టర్‌పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాలికల భద్రతకు కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.