ADB: బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామానికి చెందిన దూదేకుల కులస్తుడు షేక్ అలీ అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి మతసామరస్యం చాటుకున్నారు. అలీ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ఎంత పవిత్రంగా కఠోర ఉపవాసాలతో జరుపుకుంటామో అంతే గొప్పగా అయ్యప్ప భక్తులు ఉంటారని పేర్కొన్నారు. స్వాములకు అన్నదానం చేయడం ఆత్మసంతృప్తినిస్తుందన్నారు.