SKLM: ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. రేపు రణస్థలం మండల పంచాయతీలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటి కుళాయి పనులకు నూతన బోర్లు శంకుస్థాపన చేపట్టారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.