SKLM: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారం రోజులుగా జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విద్యార్థులు, నిరుద్యోగులు, పుస్తక ప్రియులు గ్రంథాలయాలను సందర్శించాలన్నారు.