WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రేపు (శుక్రవారం) ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.