SRPT: గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలు అని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లా గ్రంథాలయంలో జరిగిన గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పుస్తకాలు జీవితానికి దిశా నిర్దేశం చేస్తాయని, యువత చదువు ద్వారా జ్ఞానం పెంపొందించుకుని ఉద్యోగ సాధనకు ఉపయోగించుకోవాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.