GNTR: ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశోధన చేసి, వెంటనే పరిష్కరించాలని వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవీ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె 39వ డివిజన్లోని మారుతీనగర్, నాయిబ్రాహ్మణ కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం శ్మశానవాటికను శుభ్రం చేయాలని, మారుతీనగర్‌లో బీసీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ప్రణాళికలు చేయాలన్నారు.