VZM: జామి మండల కేంద్రం ఓ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ పార్టీ అధ్యక్షులు వర్రి రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ ఓ కుటుంబం అని, పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ ఒకే తాటిపై నడవాలని కోరారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్, గవర కార్పొరేషన్ డైరెక్టర్ పాల్గొన్నారు.